Tuesday, December 25, 2007

my college life

ప్రేమ!ఈ పదం ప్రతి ఒకరికి సుపరిచితమే దీనిని ఎలా వర్ణించిన తక్కువే అవుతుంది .అసలయిన ప్రేమ రాయినయిన కరిగిస్తుంది అంటారు మన పెద్దలు, ఇది కొందరిని ఉన్నత స్థానానికి చేరుస్తుంది మరి కొందరిని ఉన్మాదులను చేస్తుంది ,ప్రేమ అనేది ఒక శాశ్వితమైన భావన, అలాంటి ప్రేమ భావన నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చింది , నాలో ఉన్న నిస్రుహను పోగొట్టింది,కానీ ఆ భగవంతుడు నా ప్రేమకు మరో ప్రేమకు ముడి పెట్టి పరీక్షిస్తున్నాడు,ఈ పరీక్షలొ తను గెలవాలని కోరుకుంటున్నాను,అదేవిదంగా నేనుగెలవాలని ఆశపడుతున్నాను.ఈ సమయంలో నేను కొన్నికోల్పోయాను,మరి కొన్ని తెలుసుకున్నాను అవేమిటో చదవండి.


2004 వ సం; లో నేను కలగన్న నా స్వప్నాన్ని నెరవేర్చుకోవాలనే అశతో ఓ ప్రయివేటు డిగ్రీకాలేజీలో చేరాను,మొదట్లో నేను ఎవ్వరిని పట్టించు కొనేవాడిని కాను ,నాకు స్నేహితులు కూడా తక్కువే దానికి కారనం ఓ స్నేహితుడు చేసిన మోసం,అప్పటి నుండి ఆ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను అందుకనే చాలాతక్కువ మంది స్నేహితులయ్యారు.ఇలా దాదాపుగా నేను చేరిన ఆరు నెలల వరకు నేను నా చదువు నేను అన్న ద్యాసలో ఉండే వాడిని, ఆ తరువాతనే నా ప్రక్కన ఉన్న నాక్లాస్మెట్స్ ద్వారా ఓ అమ్మాయి పేరు విన్నాను అదే నేను మొదటి సారిగ వినిన అమ్మాయి పేరు ఆ కాలేజీలో,అలా చదువు ద్యాసలో ఉండి పోయి ఉండేవాడిని,తరువాత కూడ నా క్లాస్మేట్స్ తను గురించి చాలా మంచిగ మాట్లాడుకొనేవాల్లు ఆ మాట్లలొ ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాలనే ఆ ప్రయత్నంలో ఆ అమ్మాయి నిజంగానే మంచిదని తేలిసింది.ఆ తరువాత ఆ అమ్మాయి కాలేజిదగ్గర కనిపించగానే నా మనసు ఎంతో ఉల్లాసంగ తనను స్వాగతించేది.అలా తన మీద ఏర్పడిన అభిప్రాయం రాను రాను నాలో ఓ అసంకల్పిత చర్యగ మారిపోయింది, అది ఎలాంటిదంటే తను ఒక్క రోజు కాలేజీకి రాక పోయేసరికి నాలో ఉత్సాహం నీరుగారి పోయేది ,ఆ తరువాత నేను కాలేజీకి తన కోసం వెల్లే వాడినేమో అని అన్పించేది ఆ భావనే నాలో ఓ ప్రేమగ మారింది, ఆ ప్రేమ నాలో కూడా ఓ మంచి ప్రేమికుడు ఉన్నాడని తెలియజేసింది.అలా కొంతకాలానికి నేను తనను ప్రేమిస్తున్నాననే విషయాన్ని తనకు చెప్పేయాలని అనుకున్నాను,అలా అను కున్న కొద్దిరోజులుకే తనకు ఆ విషయాన్ని చెప్పేసాను,అదే నేను తనతొ మాట్లాడటం మొదటి సారిగ,ఆ సమయాన అందరిలాగే తను స్పందించింది.అక్కడితో నా గుండెల్లో ఉన్న బారాన్ని తగ్గించుకున్నానని బాగ సంబరిపడి పోయాను,ఆ తరువాత అదే నా జీవితానికి ఒక మలుపు కాబోతుందని ఊహించ లేక పోయాను.అలా తను నా మనసులొ నాటుక పోయింది.ఎప్పుడు నా ఆలోచనలు తన గురించే.అలా కొంత కాలానికి నేను వాల్ల కుటుంబ విషయాలను కూడా సేకరించ గలిగాను,ఆ సమయంలోనే వాల్ల ఇంటికి కూడా మూడు సార్లు వెల్లి వచ్చాను , వాల్ల అమ్మ వాల్లు నన్ను ఎంతో బాగ పలకరించారు( నేను తనను ప్రేమిస్తున్న విషయం వాల్లకు తెలియదు).వాల్ల సంతానంలో తనే మొదట పెల్లి చేసుకోవలసి అమ్మాయి (తనకు ఓ చెల్లి ,అన్న ) ఆ విషయం తలుసు కున్న ప్రతి సారి నా మనసు పెట్టే వేదనను అనుభవించే వాడిని .అలా గని ఆ సమయంలొ ఎంతో సహనంతో ఉండేవాడిని. అలా చూస్తూ ఉండగానే దాదాపుగ పరీక్షలు దగ్గరికి వచ్చేసాయి,కేవలం అప్పటికి ఒక్క నెల మాత్రమే మిగిలింది పరీక్షలకు…తన్ను ప్రేమిస్తున్నప్పటి నుండి బాగ చదవాలనే ఉద్దేశం ఉండేది కాని పుస్తకం ఎత్తుకుంటే ఎప్పుడు తనే గుర్తుకు వచ్చేది ," ఈ ప్రేమ బ్రమ అయి ఉంటే బాగున్ను అని ఏన్నో సార్లు అను కున్నాను"అలా నా చదువును నిర్లక్ష్యం చేసుకుంటు వచ్చాను దాని పలితం కనీసం పరీక్షలు కూడా పూర్తిగ వ్రాయలేదు.అలా పరీక్షలను వాయిద వేసుకున్నాను,తరువాత సెలవుల్లోకూడా నేను ఇంటికి వెల్లలేదు.అదే సమయంలో నా రూముని కూడా వాల్ల ఇంటికి దగ్గరగానే తీసుకున్నాను.ఆ రూము దగ్గరకూడా తను ఒక్క క్షణం కనిపించక పోయిన నేను తట్టుకోలేక పోయేవాడిని,అలా నిజాయతీగ ప్రేమిస్తుండే వాడిని.నా లో ఉన్న ప్రతి ఫీలింగును తనకు చూపించేవాడిని తను గమనించిందోలేదో కూడా నాకు తెలియదు.అలాగని తనని ఏ రోజు వెంట పడి వేదించలేదు.కనీసం బయట కూడా మాట్లాడ లేదు తనకు నా వల్ల ఎక్కడ చెడ్డ పేరు వస్తుందొ ఎమోనని ఆలోచించే వాడిని. అలా చూస్తూ ఉండగానే రెండో సంవత్సరం కూడా అయి పోవచ్చింది ,ఎంతగ చదవాలని అనుకున్నా చదవలేకపోయాను.తనతో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని తనూ మాట్లాడేది ఓ స్నేహితుని లాగ.తన చదువుకు నేను ఎప్పుడు అటంకం కాకూడదని ఎప్పుడు అలోచించేవాడిని.సరిగ్గా అప్పుడే నా ప్రేమకు పోటీ ఏర్పడింది.తనూ అతనితో మాట్లాడేది అతను మాట్లాడితేనే తనూ మాట్లాడేది అంతే.ఈ పరిచయాన్ని చూసిన స్నేహితులు ఎందరో ఎప్పటికెప్పుడు నన్ను హెచ్చరించే వాల్లు ,తను లేని జీవితాన్ని నేను ఊహించ లేక పోయేవాడిని,తను అంటే అంత ప్రేమ.తను ఐసెట్ కోచింగుకు చేరితే తను చేరిన చోటచేరాను.అలా రెండవ సంవత్సరం కూడా గడిచిపోయింది.నా జీవితానికి అసలయిన మలుపు మూడవ సంవత్సరం మొదలయింది .ఈ రెండు సంవత్సరాలు నా చదువును పూర్తిగ మరచిపోయాను తన ద్యాసలో పడి,అలా ఉండంగ సరిగ్గా అప్పుడే మా కాలేజీ ప్రిన్సిపాల్ గా కొత్తవారు వచ్చారు. దాని వలన మాకు ఏరోకారోజు పరీక్షలు పెట్టేవాల్లు ఆ సమయంలో కూడా ప్రేమ ముందు ఓడి పోయాను,అలా ఉండంగా సప్లమెంటరీ పరీక్షలుకు ప్రిపేరు కావాలని బాగ కష్టపడ్డాను.సరిగ్గా అదే సమయంలో ఒక రోజు ఫిజిక్స్ పరీక్ష వ్రాయ లేదు దానికి ఆ మేడం తనకు ఇష్టం వచ్చినట్లు మా క్లాసులో అందరి ముందు బాగ అవమానించింది ,అందరి ముందుకన్నా తన ముందు అవమానించిందనే బాదను భరించ లేక పోయాను.ఆ రోజు నుండి నేను కాలేజీకి పోలేదు. తరువాత అలా మద్యంతరంగా డిగ్రీని నిలిపివేసినందు చాలా బాదపడ్డాను,ఇంట్లోవాల్లు ఎన్నోసార్లు సర్ది చెప్పారు కాలేజీకి పోమని కాని నా మనసు దానికి అంగీకరించ లేదు, ఆ సమయంలో నేను ఎంతో మనో వేదనను అనుభవించాను ఎంతలా అంటే ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి.కాని ఆ ఆలోచనను చంపేసాను,దీనికి కారణం నేను చదివిన పుస్తకాలు,ఆ తరువాత "CA"చేయాలనుకున్నాను అక్కడా విదినన్ను వెక్కిరించింది కాని దీనిని సాదిస్తాననే నమ్మకం ఉంది.అలా ఉద్యోగ వెదుక్కుంటూ బెంగళూరుకు వెల్లాను అక్కడ ఉద్యోగం చేస్తు ఉండగా ఆ పరేషన్ చేసుకోవాల్సి వచ్చింది.అది స్తిమితపడటానికి దాదాపుగ 1 1/2 నెల పట్టింది .నాకు డిగ్రీలో ఓ హాభీ ఉండేది షేరు మార్కెట్ గురించి తెలుసు కోవడం అదే నన్ను కాపాడుతున్నది,ఆ సమయంలో దాని మీద రీసర్చే చేసాను,అదే నా జీవితానికి ఆత్మస్థైర్యాన్నిచ్చింది. "దీని మీదనేను చేసిన రీసర్చును కూడా మీతో పంచుకుంటాను " మీతో పంచుకోలేని ఎన్నో భాదలనుభరించాను , ఆ సమయాన కూడాతనను మరచిపోలేదు నేను వేసే ప్రతి అడుగు తనకే అంకితం , తను నన్ను ఇష్టపడుతుందో లేదో నాకు తెలియదు నేను గెలుస్తాననే నమ్మకం ఉంది , , తను నాకు దక్కాలని ఎక్కడ బడాయి గాని( ఉన్నది లేనట్టుగాని లేనిది ఉన్నట్టుగా), అవేశ పడి తప్పుడు నిర్ణయాలును ఇప్పటి వరకు తీసుకోలేదు ఇక మీద కూడా తీసుకోబోను ఈ ప్రేమ విషయంలో తను ఎలాంటి నెర్ణయం తీసుకున్న మనస్పూర్తిగ స్వాగతిస్తాను,తన విషయంలో నేను ఓ చిరస్మరణీయ ప్రేమికునిగా తప్పక మిగిలి పోతాను,తను తన జీవితంలో మరెంతో ఉన్నత స్తానానికి ఎదగాలని మనస్పూర్తిగ కోరుకుంటున్నాను,తన సంతోషంమే నాకు కావాలి.ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి ప్రేమను ప్రేమతో తప్ప మరి దేనితోనుగెలవలేం.Bye Good luck we meet again another Blog